పూర్తి విశ్వాసం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో టాప్ స్టార్‌గా ఎదగడానికి తాప్సీ తాపత్రయం రోజురోజుకూ ఎక్కువవుతోంది. అదేంటి.. దక్షిణాదిలో తిరగగొట్టారు కదా, కథానాయికగా గుర్తింపు ఇవ్వలేదు కదా అని అడిగితే, దక్షిణాదిలో తన సినిమాలన్నీ పరాజయంపాలైన మాట నిజమేనని, ఉత్తరాదిలో మాత్రం తాను సక్సెస్‌ఫుల్ కథానాయికగా నిరూపించుకున్నానని తనను తాను సమర్ధించుకుంటుంది. టాప్‌స్టార్‌గా ఎదగడానికి ఎన్ని అవార్డులు తీసుకోవాలి? లేదా ఏవైనా ప్రవేశ పరీక్షలున్నాయా? అని అడుగుతూ ఎలాంటి పరీక్షలు రాయడానికైనా తాను సిద్ధంగా వున్నానని పూర్తి విశ్వాసంతో చెబుతోంది సొట్టబుగ్గల తాప్సీ. దక్షిణాదిలో తన పరాజయాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని, పరాజయాలను ఎలా ఆపలేమో విజయాలను కూడా అలా కట్టడి చేయలేమని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ముల్క్ అనే సినిమాలో ఆమె నటిస్తోంది. ఈ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకొంది తాప్సీ. ఈ సినిమా హిట్టయితే కనుక తప్పక తనను టాప్‌స్టార్‌గా గుర్తించాల్సిందేనని అంటోంది తాప్సీ. చూద్దాం.. ఆమె జాతకం ఎలా వుందో?