మాస్ హీరోగా గుర్తింపు వస్తుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగ అనే్వష్, హెబ్బాపటేల్ జంటగా బాహుబలి పళని దర్శకత్వంలో సరస్వతి ఫిలిమ్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ‘ఏంజిల్’ చిత్రం శుక్రవారం విడుదలవుతున్న సందర్భంగా హీరో నాగ అనే్వష్ చెప్పిన విశేషాలు....
స్క్రిప్ట్‌కోసం...
ఈ సినిమా స్క్రిప్ట్‌కోసం ఏడాదిన్నర కాలం పట్టింది. ఆ తర్వాత నాలుగు నెలల్లోనే షూటింగ్ జరిపాం, కామెడీ ప్రధానంగా సాగే ఈ సినిమా సోషియో ఫాంటసీగా ఉంటుంది. అన్ని రకాల కమర్షియల్ హంగులతో తెరకెక్కిన ఈ చిత్రంలో నా పాత్ర విగ్రహాలను స్మగుల్ చేసే యువకుడిగా కనిపిస్తాను. నాతోపాటు సప్తగిరి ఉంటాడు. ఆ సమయంలో ఏజంల్ ఎలా స్వర్గం నుంచి వచ్చింది, ఆ తర్వాత ఏం జరిగిందన్నది అసలు కథ.
మూడు భాషల్లో...
ఈ చిత్రాన్ని మూడు భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ముందు తెలుగులో విడుదల చేసి తర్వాత తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తాం. ముఖ్యంగా హిందీలో మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే బిజినెస్ కూడా భారీగా జరిగింది.
మార్పు చూస్తారు
మొదటి సినిమా సమయంలో చాలా సన్నగా కనిపించాను. అందుకని ఈ సినిమాకోసం కాస్తా లావుగా మారాను. ఈ సినిమా తర్వాత నాకు మాస్ ఇమేజ్ వస్తుందని ఆశిస్తున్నాను. సినిమా ఆలస్యం అవటానికి కారణం గ్రాఫిక్స్ వర్కే, దానికోసం ఆరు నెలల కాలం పట్టింది. అద్భుతమైన గ్రాఫిక్స్‌ను ఈ సినిమాలో చూస్తారు.
తదుపరి చిత్రాలు
ఈ సినిమా తర్వాత ఓ స్క్రిప్ట్ కుదిరింది. త్వరలోనే దానికి సంబంధించిన వివరాలను తెలియజేస్తా...

- శ్రీ