ట్రైలర్‌లో వానవిల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాహుల్ ప్రేమ్ మూవీ మేకర్స్ పతాకంపై ప్రతీక్ ప్రేమ్‌కరణ్ స్వీయ దర్శకత్వంలో లంక కరుణాకర్‌దాస్ రూపొందించిన చిత్రం ‘వానవిల్లు’ శ్రావ్యారావు, విశాఖ కథానాయికలుగా నటించారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను నటుడు కాశీవిశ్వనాథ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమర్షియల్ ఎలిమిటెంట్స్‌తో సమాజానికి ఉపయోగపడేలా ఓ మంచి చిత్రం చేయాలనుకున్న దర్శక, హీరో అభిరుచికి నిదర్శనంగా ఈ చిత్రం రూపొందిందని, తన మనసులో ఏదైతే అనుకున్నాడో అదే తెరపై చూపిస్తాడని తెలిపారు. పేరు క్లాస్‌గా ఉన్నా సినిమా మాత్రం మాస్‌గా ఉంటుందని ప్రతీక్ ఈ సాహసం వెనుక అతనికి పూర్తి సహకారం అందించిన యూనిట్‌ను అభినందిస్తున్నాని అన్నారు. ఒక సినిమా చేయాలంటే ముఖ్యంగా నాలుగు పిల్లర్స్ లాంటి వ్యక్తులు ఉండాలని, దాదాపు రెండువందల మంది రెండున్నర సంవత్సరాలుగా కష్టపడి ఈ చిత్రాన్ని రూపొందించామని ప్రతీక్ ప్రేమ్‌కరణ్ తెలిపారు. ఈ సినిమాలో అంశాలు ప్రతి ఒక్కరికి నచ్చుతాయని, ఈ నెలలోనే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన అన్నారు. కార్యక్రమంలో సంగీత దర్శకుడు ప్రభు ప్రవీణ్, సాయికార్తీక్, చిన్నికృష్ణ, ఫణి, అనితాచౌదరి, భాస్కర్, నవీన్, పొట్టి చిట్టిబాబు, శ్రావ్యారావు తదితరులు పాల్గొని విశేషాలను తెలిపారు. హేమ, ప్రవీణ్, శత్రు, వేణు, ఫణి, శ్రీ్ధర్, అనితాచౌదరి, మహేష్, జోషి, సురేఖావాణి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ప్రభు ప్రవీణ్, కెమెరా: ఎస్‌డి జాన్, నిర్మాత: లంక కరుణాకర్ దాస్, కథ, స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్, దర్శకత్వం: ప్రతీక్ ప్రేమ్‌కరణ్.