లోకల్ దర్శకుడితో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్‌చరణ్ ప్రస్తుతం నటిస్తున్న రంగస్థలం జోరుగా షూటింగ్ జరుకుంటున్న విషయం తెలిసిందే. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా తరువాత చరణ్ కోసం ఇద్దరు ముగ్గురు దర్శకులు క్యూలో ఉన్నారు. అందులో బోయపాటి శ్రీనుతో సినిమాకు చరణ్ కమిట్ అయ్యాడట. అలాగే కొరటాల శివతో కూడా మరో సినిమా ఉంది. తాజాగా నాని హీరోగా ‘నేను లోకల్’ సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న త్రినాథరావు కూడా చరణ్‌కు కథ చెప్పాడట. కానీ ఇప్పటికే రెండు కమిట్‌మెంట్స్ ఉండడంతో చరణ్ నో చెప్పాడట? దాంతో ఆ కథ కోసం రామ్ లైన్‌లోకి వచ్చాడట! త్రినాథరావు చెప్పిన కథ నచ్చడంతో రామ్ ఈ సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. తాజాగా ‘ఉన్నది ఒకటే జిందగీ’లో మంచి విజయాన్ని అందుకున్న రామ్ తదుపరి సినిమా త్రినాథరావుతో వుంటుందట.