డూడూ ఢీ ఢీ సెన్సార్ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కొమరం భీమ్’ ఫేం భూపాల్ ప్రధాన పాత్రలో మాస్ట సాయి, బేబి కావేరి, బేబి అభి, వింజమూరి మధు ప్రధాన పాత్రలో అల్లాణి శ్రీ్ధర్ స్వీయ దర్శకత్వంలో ఫిల్మిడియా ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై శ్రీమతి చింతా లక్ష్మీ నాగేశ్వరరావు సమర్పణలో నిర్మించిన చిత్రం ‘డూ డూ ఢీ డీ’ (మా ఊరి కొండ). ఈ చిత్రానికి సంబంధించి సెన్సార్ పూర్తయిందని దర్శకుడు అల్లాణి శ్రీ్ధర్ తెలిపారు. ఆన్‌లైన్ గేమ్స్, డిజిటల్ వ్యసనం నుండి మన పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి? అన్న కథాంశంతో రూపుదిద్దుకున్న ఈ బాలల చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు ఎంతగానో ప్రశంసించారని, ఇలాంటి చిత్రాలు రావలసిన ఆవశ్యకతను తెలియజేశారని చెప్పారు. క్లీన్ యు సర్ట్ఫికెట్ పొందిన ఈ చిత్రంలో ‘కొమరం భీమ్’ ఫేం భూపాల్ ప్రధాన పాత్రను పోషించారని తెలిపారు. అలాగే బాలలకు ఊరికొండ గురించి చెప్పే చక్కటి పాత్రలో వింజమూరి మధు చక్కటి నటనను కనబరిచారని చెప్పారు. ఇందులో నటించిన బాల నటీనటులు అందరూ తమ ప్రతిభను చాటుకున్నారని చెప్పారు. హైదరాబాద్‌లో జరిగే 20వ అంతర్జాతీయ బాలల దినోత్సవంలో ఈ చిత్రం ప్రదర్శనకు ఎంపికైనట్లు చెప్పారు. సహ నిర్మాత కిరణ్‌కుమార్ మాట్లాడుతూ ‘శతమానం భవతి’ వంటి చిత్రాలు అవార్డులు, రివార్డులు సాధించడం చూశాక ఈ తరహా సినిమా విజయాల పట్ల పూర్తి నమ్మకం పెరిగిందని తెలిపారు. ఈ ‘డూ డూ ఢీ డీ’ చిత్రానికి సెన్సార్ ప్రశంసలు లభించడం ఆనందంగా వుందన్నారు. 20వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవంలో ప్రదర్శించనున్న ఈ చిత్రాన్ని అందరూ ఆదరిస్తారమన్న నమ్మకం వుందన్నారు. ఇతర పాత్రల్లో సంగకుమార్, పవన్, చిన్నికృష్ణ, సంజన, సుదీప్తి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: శశీప్రీతమ్, నేపథ్యం: సాబు నర్గీస్, ఎడిటింగ్: కంచాల శ్రీనివాస్, సహకార దర్శకుడు: చక్రపాణి ఆనందం, ప్రాజెక్టు కో-ఆర్డినేటర్: డా. రామచంద్ర వారణాసి, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: సి.హెచ్ లతీఫ్, ప్రొడక్షన్ డిజైనర్: చింతలపూడి రామారావు, సమర్పణ: శ్రీమతి చింతా లక్ష్మీ నాగేశ్వరరావు, రచన-దర్శకత్వం: అల్లాణి శ్రీ్ధర్.