డిసెంబర్‌లోనే సౌఖ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోపీచంద్, రెజీనా జంటగా వస్తున్న చిత్రం సౌఖ్యం. ఎఎస్ రవికుమార్ చౌదరి దర్శకుడు. చిత్రం పోస్ట్‌ప్రొడక్షన్స్ జరుపుకుంటోంది. నిర్మాత ఆనంద్ ప్రసాద్ మాట్లాడుతూ దర్శకుడి గత చిత్రాలకన్నా మిన్నగా దీన్ని రూపొందించాడని, రెండు పాటల్ని సోమవారం నుంచి హైదరాబాద్‌లో చిత్రీకరించనున్నట్టు చెప్పారు. 13న ఒంగోలులో ఆడియో విడుదల చేస్తామన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుందని అన్నారు. గోపీ మార్క్ యాక్షన్‌కు శ్రీ్ధర్ సీపాన కథకు తగ్గ మాటలు రాశారని, క్రిస్మస్ కానుగా డిసెంబర్ 25న చిత్రం విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్టు చెప్పారు. షావుకారు జానకి, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, జయప్రకాష్‌రెడ్డి, జీవా, రఘుబాబు, కృష్ణ్భగవాన్, ముఖేష్ రుషి, దేవా, పృధ్వీ, రఘు, శివాజీరాజా, సురేఖావాణి, సత్యకృష్ణ, సత్యం రాజేష్ తదితరులు నటిస్తున్నారు.