మమ్ముట్టి తనయుడితో ‘జతగా’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మలయాళంలో సూపర్‌హిట్ అయిన ఉస్తాద్ హోటల్ చిత్రాన్ని తెలుగులో సురేష్ కొండేటి అనువదించారు. మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా అన్వర్ రషీద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి తెలుగులో ‘జతగా’ అనే పేరును ఖరారు చేశారు. ఈ సందర్భంగా నిర్మాత సురేష్ మాట్లాడుతూ.. లవ్ సెంటిమెంట్ పేద, ధనిక వర్గాల మధ్య ఉండే బేధం, తదితర అంశాలతో రూపొందిన ఫీల్‌గుడ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందిందని తెలిపారు. ‘ఓకె బంగారం’ చిత్రంలో దుల్కర్, నిత్యామీనన్ జోడి ప్రేక్షకులకు నచ్చిందని, ఈ చిత్రంలో కూడా వారిద్దరి జంట సరికొత్తగా ఉంటుందని, త్వరలో పాటలను విడుదల చేసి, డిసెంబర్‌లోనే చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: ఎస్.లోకనాథన్, దర్శకత్వం: అన్వర్ రషీద్.