సుధీర్‌కు జోడీగా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుధీర్‌బాబు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా వున్నారు. తాజాగా ఆయన నటించిన ‘శమంతకమణి’ మంచి విజయం సాధించడంతో మరింత క్రేజ్ పెరిగింది. తాజాగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. పూర్తిస్థాయి రొమాంటిక్ ఎంటర్‌టైన్‌గా తెరకెక్కే ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ నటించనున్నదట. ఈ చిత్రంలో సుధీర్ సరసన కొత్త అమ్మాయి అయితేనే బాగుంటుందని దర్శకుడు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ భామ అతిదీరావ్ హైదరీని ఎంపిక చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానున్నదట. స్వతహాగా హైదరాబాదీ అమ్మాయి అయిన అతిదీరావు బాలీవుడ్‌లో సెటిలైంది. ఈ మధ్యే ప్రముఖ దర్శకుడు మణిరత్నం సినిమాలో నటించింది. మరి సుధీర్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంటర్ అవుతున్న అతిది హీరోయిన్‌గా ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంటుందో చూడాలి.