తెలుగువారి ఆదరణ మరచిపోలేను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళంతో పాటు తెలుగులో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విశాల్ భిన్నమైన సినిమాలతో అలరిస్తూనే వున్నాడు. తాజాగా ఆయన నటించిన తమిళ చిత్రం ‘తుప్పరివాలన్’ తెలుగులో ‘డిటెక్టివ్’ పేరుతో విడుదల చేస్తున్నారు. మిస్కిన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 10న విడుదలవుతున్న సందర్భంగా హీరో విశాల్ చెప్పిన విశేషాలు..
మంచి పేరు తెచ్చిపెట్టింది..
తమిళంలో గత నెలలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసువద్ద ఘనవిజయాన్ని అందుకుంది. హీరోగా నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ చిత్రంలో కథ, కథనం భిన్నంగా సాగుతూ, ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా వుంటాయి. ‘డిటెక్టివ్’ పాత్ర ఎలా వుంటుందో అందరికీ తెలుసు. కానీ దాన్ని కాస్త భిన్నంగా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేయడం కుదిరింది. తమిళంలో లాగానే తెలుగులో కూడా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం వుంది.
ప్రతిభగల దర్శకుడు..
దర్శకుడిగా మిస్కిన్‌కు తమిళనాడులో మంచి పేరుంది. ప్రతిభగల దర్శకుడిగా ఇప్పటికే పలు చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ను ప్రజెంట్ చేయడంలో దర్శకుని ప్రతిభ అద్భుతం.
ఇతర పాత్రలు..
ఈ చిత్రంలో హీరోయిన్‌గా అను ఇమాన్యుయెల్, ఆండ్రియాలు నటించారు. ముఖ్యంగా అను అద్భుతంగా కనిపించింది. ఆండ్రియా నెగెటివ్ షేడ్‌లో అదరగొట్టింది. అలాగే ప్రసన్న కూడా బాగా నటించాడు.
ప్రేక్షకుల అభిమానం...
నా చిత్రాలను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు. వారి ఆదరణ నేను ఎన్నటికీ మరచిపోలేను. ఆ తరహాలోనే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ ‘డిటెక్టివ్’ కూడా ప్రేక్షకులకు నచ్చుతుందన్న నమ్మకముంది.

- శ్రీ