1న ‘కన్నుల్లో నీ రూపమే...’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ నటుడు నందు, తేజస్విని ప్రకాష్ జంటగా రూపొందుతున్న చిత్రం ‘కన్నుల్లో నీ రూపమే..’. ఎఎస్‌పి క్రియేటివ్ బ్యానర్‌పై భాస్కర్ భాసాని నిర్మాతగా బిక్స్ ఇరుసడ్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం హృదయాన్ని హత్తుకునే స్వచ్ఛమైన కథాంశంతో రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 1న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించి సాకేత్ సంగీత సారథ్యంలో విడుదలైన ఈ సినిమా పాటలకు యూట్యూబ్‌లో మంచి స్పందన రావడం విశేషం. హీరో నందు నటన, సాకేత్ బీజీఎం, చిత్ర కథనం, కథాంశాలు ఈ చిత్రానికి హైలైట్‌గా నిలవనున్నాయి. మనసును కదిలించే సన్నివేశాలతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ మమపాలల్లో ఉంటూ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా దర్శకుడు బిక్స్ మలిచారు. త్వరలో కొత్త ట్రైలర్‌ను విడుదల చేసి ఈ నెలాఖరున చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను ఏర్పాటు చేస్తున్నట్లు దర్శక, నిర్మాతలు తెలిపారు.