మరో రీమేక్‌లో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో సూపర్‌హిట్ అయిన ‘క్వీన్’ చిత్రాన్ని తెలుగులో తమన్నా కథానాయికగా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం తమన్నా చేతిలో ఈ ఒక్క ప్రాజెక్టే వుండగా, మరో రీమేక్‌లో తమన్నా నటించనున్నదని టాలీవుడ్ సమాచారం. అయితే ఈ చిత్రం హిందీలో రూపొందించనున్నారు. తమిళంలో విజయవంతమైన ‘జిగర్‌థండా’ చిత్రాన్ని హిందీలో నిశికాంత్ కామత్ దర్శకత్వంలో అజయ్ దేవగన్ నిర్మాతగా మారి రూపొందించనున్నారు. ఈ చిత్రంలో తమన్నాను కథానాయికగా ఎంపిక చేసే అవకాశాలు మెండుగా వున్నాయట. తమన్నా కూడా కథ విని గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. సంజయ్‌దత్ ఓ కీలకమైన పాత్రలో నటించనున్నారట. ప్రస్తుతం తమన్నా చేతిలో రెండు రీమేక్ చిత్రాలు ఉన్నట్టు లెక్క.