బాలల చిత్రోత్సవ నిర్వహణ భేష్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిత్య క్రియేటివ్ జీనియస్ అనే చిత్రాన్ని నిర్మించి చిన్నారులలో స్ఫూర్తినింపారు దర్శక నిర్మాత భీమగాని సుధాకర్‌గౌడ్. రెండేళ్ల కిందట విడుదలైన ఈ చిత్రం 100 శాతం వినోదపు పన్ను ను మినహాయింపును పొంది ప్రభుత్వ ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని బాలల చలన చిత్రోత్సవంలో ప్రదర్శిస్తున్నారు. చిత్రోత్సవాలలో ప్రదర్శనకు తెలుగు భాషనుండి ఎంపికైన 8 చిత్రాలలో ఆదిత్య కూడా వుంది. ఆదిత్య క్రియేటివ్ జీనియస్ చిత్రాన్ని తిలకించేందుకు బాల బాలికలు ఆసక్తి చూపిస్తుండడం పట్ల దర్శక నిర్మాత సుధాకర్‌గౌడ్ సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో జరుగుతున్న 20వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవ నిర్వహణ బాగుందంటూ ఆయన ప్రశంసించారు. బాలల చిత్రోత్సవాలకు మన నగరం శాశ్వత వేదిక కావడం సంతోషదాయకమని ఆయన అన్నారు. ఐమాక్స్ వేదికలో సుధాకర్‌గౌడ్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థిలో ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నంగా ఈ చిత్రాన్ని రూపొందించామని, కృషి చేస్తే ప్రతి ఒక్కరూ భారతరత్న అబ్దుల్ కలామ్‌లా విజయాలు సాధించవచ్చనే సందేశాన్ని ఇచ్చామని తెలిపారు. బాల బాలికలలో అంతర్గతంగా ఎంత శక్తి దాగివుందో మా చిత్రం ద్వారా చూపించామని, రేపటి పౌరులైన బాలలు చిన్న చిన్న విషయాలపై ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పామని ఆయన అన్నారు. ఇంకా అనేక మంచి అంశాలతో స్ఫూర్తివంతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, ప్రస్తుతం చిత్రోత్సవాలలో తమ సినిమా వుండడం సంతోషదాయకమని, తెలంగాణ ప్రభుత్వం అంతర్జాతీయ బాలల చిత్రోత్సవాలను అద్భుతంగా నిర్వహిస్తుందని ఆయన అన్నారు. దేశ విదేశాలనుండి ఎంతోమంది పిల్లలు, ఆహ్వానితులు, ప్రత్యేక అతిథులు వస్తున్నారని, వీళ్ల రాకే చిత్రోత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని, మొత్తం 1402 చిత్రాలలో 300 సినిమాలను ఇక్కడ ప్రదర్శిస్తున్నారని ఆయన అన్నారు. ఇవన్నీ ఎంతో అనుభవంగల జ్యూరీ సభ్యులు ఎంపిక చేసినవని, కాబట్టి ప్రతి చిత్రం ఉత్తమంగా ఉండి బాల బాలికలను ఆలోచింపజేస్తున్నాయని ఆయన వివరించారు.