పిల్లల చిత్రాలపై దృష్టిసారించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బాహుబలి’ లాంటి భారీ బడ్జెట్ చిత్రం ఎంత కష్టమో, పిల్లల సినిమాలు తీయడం కూడా అంతే కష్టమని, కొమరం భీమ్, గౌతమ్‌బుద్ధ, తూహీ మేరీ గంగ వంటి అవార్డు చిత్రాల నిర్మాత అల్లాణి శ్రీ్ధర్ అన్నారు. ‘బ్లూవేల్’ వంటి ఆన్‌లైన్ వీడియో గేమ్స్ పిల్లలపై చూపుతున్న దుష్ప్రభాన్ని కథా వస్తువగా తీసుకుని ఆయన దర్శకత్వం వహించిన ‘్ఢ ఢూ డీ డీ’ (మా ఊరుకొండ) చిత్రం 20వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవంలో ప్రదర్శిస్తున్న సందర్భంగా ఈరోజు ప్రసాద్ ఐమాక్స్ థియేటర్‌లోని బాలల చిత్రోత్సవం మీడియా సెంటర్‌లో అల్లాణి శ్రీ్ధర్ మీడియా సెంటర్‌లో జరిగిన సమావేశంలో చిత్ర విశేషాలను, బాలల చిత్రాలపై తమ అభిప్రాయాలను వివరించారు. అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవంలో పిల్లల ఆనందాన్ని చూస్తుంటే, తెలుగు చిత్ర పరిశ్రమ చిన్నారులకు తగిన న్యాయం చేయలేదనిపిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి భారీ చిత్రాలు నిర్మిస్తున్న నిర్మాతలు కనీసం ఒక్క సినిమా అయినా బాలల కోసం తీయాలని అన్నారు. ఈ సందర్భంగా అల్లాణి శ్రీ్ధర్ ఇటీవల సుప్రీంకోర్టు, పిల్లల కోసం విజ్ఞాన ప్రధానమైన చిత్రాలు తీయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయాన్ని గుర్తుచేశారు.
పిల్లల చిత్రాలు తీసే నిర్మాతలు, దర్శకులు కేవలం అవార్డుల కోసం లేదా ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ కోసం చిత్రాలు తీయరని శ్రీ్ధర్ అన్నారు. అయితే పిల్లల సినిమాకు మరింత ప్రోత్సాహం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. బాలల చిత్రాలు వారికి స్ఫూర్తిదాయకంగా ఉండాలన్నారు. పిల్లల కోసం నిర్మించే చిత్రాలు వారిలో నైతిక విలువలు పెంపొందించేలా వుండాలన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం బాలల చిత్రాలకు ఇచ్చే సబ్సిడీని రూ.15 లక్షలకు పెంచడాన్ని శ్రీ్ధర్ స్వాగతించారు. ఈ చిత్రంలో కీలక తాత పాత్ర పోషించిన ప్రముఖ నటుడు ‘కొమరం భీమ్’ ఫేం భూపాల్ మాట్లాడుతూ ఈ చలనచిత్రోత్సవానికి బాల లే హీరోలు అని అన్నారు. ఈ ఆనందం వారిదేనన్నారు. సాంకేతిక విజ్ఞానం అవసరమే గానీ, అది వినాశనానికి దారితీయరాదని ఆయన అన్నారు. పిల్లలు తప్పు చేయరు, పెద్దలు చేసే తప్పులే పిల్లలను చెడు మార్గంలోకి తీసుకుపోతాయని భూపాల్ స్పష్టం చేశారు. ఈ చిత్రంలో తాత పాత్ర పోషించిన తనకు ఈ చిత్రం సంతృప్తినిచ్చిందన్నారు. పిల్లలుగా నటించిన బాల నటులు బేబి కావేరి, మాస్టర్ సాయి, చిత్ర నిర్మాత కిరణ్‌కుమార్ చింతా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో దర్శకుడు అల్లాణి శ్రీ్ధర్‌ను నటుడు భూపాల్, నిర్మాత కిరణ్‌కుమార్ ఘనంగా సత్కరించారు.