సోషల్ మీడియా నేపథ్యంలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాబి సింహా, అమలాపాల్, ప్రసన్న ముఖ్యపాత్రల్లో సుశిగణేషన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దొంగోడొచ్చాడు’. ఏజిఎస్ ఎంటర్‌టైన్స్‌మెంట్స్ పతాకంపై తెలుగు-తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కల్పతి ఎస్. అఘోరన్, కల్పతి ఎస్. గణేష్, కల్పతి ఎస్. సురేష్‌లు నిర్మాతలు. ఈ చిత్రం డిసెంబర్‌లో విడుదలవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో పాటల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాబి సింహా మాట్లాడుతూ తిరుట్టు పాయిలె 2 చిత్రాన్ని తెలుగులో ‘దొంగోడొచ్చడు’ పేరుతో విడుదల చేస్తున్నారు. నవంబర్ 30న తమిళంలో విడుదలవుతుంది. డిసెంబర్ రెండవ వారంలో తెలుగులో విడుదల చేయనున్నాము. సోషల్ మీడియా అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన మీడి యా. దీనివల్ల మంచితోపాటు చెడుకూడా ఉంది. అలాంటి అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు. విద్యాసాగర్ అందించిన సంగీతం హైలెట్‌గా నిలిచిందని అన్నారు. హీరోయిన్ అమలాపాల్ మాట్లాడుతూ టాలీవుడ్‌లోకి చాలా రోజుల తర్వాత వస్తున్నందుకు ఆనందంగా ఉంది. జీవితంలో ఎన్నో కలలు, ఆశలు ఉన్న ఓ అమ్మా యి జీవితం సోషల్ మీడియా కారణంగా ఎలా మారిందనే ఆసక్తికర అంశాలతో తెరకెక్కించిన చిత్రమిది అన్నారు.