విజువల్ వండర్‌గా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజువల్ వండర్‌గా..చరిత్ర భవిష్యత్తును వెంటాడుతోంది అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందించిన చిత్రం ‘సువర్ణ సుందరి’. జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి, సాయికుమార్ ప్రధాన తారాగణంగా సూర్య.ఎం.ఎస్.ఎన్. దర్శకత్వంలో ఎం.ఎల్.లక్ష్మీ రూపొందించిన ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఇటీవల విడుదలైంది. రిలీజ్ అయిన కొద్ది సమయంలోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారిందని, హిస్టారికల్ అడ్వెంచర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం వైవిధ్యంగా రూపొందిందని దర్శకుడు తెలియజేశారు. సూర్య టేకింగ్‌తోపాటు ఎలూ మహంతి విజువల్స్, సాయి కార్తీక్ ఆర్.ఆర్ టీజర్‌లో హైలెట్‌గా చెబుతున్నారని, భారీ బడ్జెట్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా రూపొందించామని ఆయన అన్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను త్వరలో విడుదల చేసి డిసెంబర్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. నాగినీడు, కోట శ్రీనివాసరావు, అవినాష్, ముక్తార్‌ఖాన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, దర్శకత్వం: సూర్య ఎం.ఎస్.ఎన్.