శ్రమకు ఫలితమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాల బాలికలలో కుల మత భేదాలు ఉండకూడదు. కేవలం ప్రతిభ ఆధారంగానే పిల్లలు ఎదిగి భావి పౌరులుగా రూపొందాలి అని అబ్దుల్ కలామ్ లాంటి గొప్పవారు చెప్పిన మాటల ప్రేరణతో రూపొందించిన ‘ఆదిత్య క్రియేటివ్ జీనియస్’ చిత్రానికి నంది అవార్డు రావడం ఆనందదాయకంగా ఉంది. తాము పడిన శ్రమకు ఫలితంగా ఈ అవార్డు వచ్చిందని భావిస్తున్నాను అని దర్శక నిర్మాత భీమగాని సుధాకర్‌గౌడ్ తెలిపారు. బాలల చలనచిత్రోత్సవ పురస్కారాల్లో భాగంగా ఆయన రూపొందించిన ‘ఆదిత్య క్రియేటివ్ జీనియస్’ చిత్రానికిగాను సుధాకర్‌గౌడ్ ఉత్తమ బాలల చిత్ర దర్శకుడిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయన పలు విశేషాలు తెలిపారు. పెద్దవాళ్ళతోకంటే పిల్లలతో సినిమాలు రూపొందించడం చాలా కష్టం. బాలల చిత్రాలకు సంబంధించి ఈ అవార్డు రావడం మరింత ఆనందాన్నిచ్చింది. విద్యా సంస్థల అధిపతిగా చిన్నారులపట్ల కొన్ని బాధ్యతలు నాకున్నాయి. అందుకే ఈ చిత్రాన్ని రూపొందించాను. పిల్లల సినిమా అంటే నిర్మాణ విలువలు బాగా ఉండవని అనుకుంటారు. కానీ దాదాపు రెండున్నర కోట్ల రూపాయలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. శాస్త్ర సాం కేతిక రంగాల్లో మన దేశం అభివృద్ధి చెందాలంటే మరెందరో అబ్దుల్ కలామ్‌లు రావాలి. అందుకోసం ప్రతిభ వున్న బాల బాలికలను వెన్నుతట్టి ప్రోత్సహించాలి అనే విషయాన్ని ఈ చిత్రంలో చర్చించాం.
అలాగే చిన్న చిన్న పరాజయాలకు, తప్పులకు ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పాం. పర్యావరణ పరిరక్షణ గుర్తుచేసే అంశాలు కూడా చిత్రంలో ఉన్నాయి. ఇలా బాలలకు స్ఫూర్తి కలిగించే అనేక అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాలు రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నాను అని ఆయన వివరించారు.