ఉమ్మడి కుటుంబాల నేపథ్యంలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందు, శ్రీముఖి, కమల్ కామరాజు ప్రధాన పాత్రధారులుగా వి.ఎస్.వాసు దర్శకత్వంలో భాస్కర్ గ్రూప్ ఆఫ్ మీడియా సమర్పణలో రూపొందుతున్న చిత్రం ‘కుటుంబ కథా చిత్రం’. దాసరి భాస్కర్ యాదవ్ నిర్మిస్తున్న ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ను ప్రసాద్ లాబ్‌లో హీరో నందు విడుదల చేయ గా, టీజర్‌ను నిర్మాత మల్కాపురం శివకుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- టీజర్, మోషన్ పోస్టర్లు ఏ విధంగా అలరించామో అదే విధంగా ట్రైలర్, సినిమా కూడా ఉం టుంది. మంచి కానె్సప్ట్ బేస్డ్ చిత్రమిది అని చెప్పా రు. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇపు డు అవి పరిమిత కుటుంబాలుగా మారిపోయాయి. ప్రేమతో గొడవపడే ఓ ఫ్యామిలీకి ఆ ఇంటి సెక్యూరిటీనే రాబంధులుగా మారితే ఆ పరిణామం ఎలా వుంటుందో తెలిపేదే మా చిత్రం. అందరికీ తప్పకుండా నచ్చుతుంది అని దర్శకుడు అన్నారు. డిఫరెంట్ కానె్సప్ట్, ఫ్రెష్ స్క్రీన్‌ప్లే ఉండే చిత్రమిది అని హీరో నందు తెలిపారు. కమల్ కామరాజు మాట్లాడుతూ గతంలో నటించిన చిత్రాలతో పోలిస్తే ఇదొక పూర్తి వైవిధ్యమైన చిత్రం. ఇందులో నా పాత్ర పాజిటివ్‌గా ఉంటుందా? లేక నెగెటివ్‌గా ఉంటుందా? అనేది సినిమా చివర్లో తెలుస్తుంది అని చెప్పారు.