షీ టీమ్ నేపథ్యంలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వకర్మ క్రియేషన్స్ పతాకంపై శిరీష్, గౌతమి జంటగా లక్ష్మణ్ కంచరి స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘లక్ష్మీనిలయం’. ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా లక్ష్మణ కంచరి మాట్లాడుతూ- ఇది ఒక షీ టీమ్ పోలీస్ ఆఫీసర్ కధ అని, సమాజంలో మహిళలపై వేధింపులు ఎలా ఉన్నాయి, వాటిని మహిళలు ఎలా ఎదుర్కోవాలి? షీ టీమ్‌ను ఎలా సంప్రదించాలి? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే కథాంశంతో రూపొందిస్తున్న చిత్రం ఇదని తెలిపారు. డిసెంబర్ రెండవ వారంలో షూటింగ్ ప్రారంభించి హైదరాబాద్, మెదక్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుతామని, ఫిబ్రవరిలో షూటింగ్ పూర్తిచేసి ఏప్రిల్‌లో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఈ చిత్రానికి ఎడిటింగ్:నందమూరి హరి, సంగీతం:యాజమాన్య, కెమెరా:ఎ.కె.ఆనంద్, కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకత్వం:లక్ష్మణ్ కంచరి.