ఇక సెలవ్ అంటున్న జంట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రీన్‌సన్ ఇన్నోవేటివ్స్, జైహిత క్రియేషన్స్ పతాకంపై గన్నవరపు చంద్రశేఖర్ రూపొందించిన చిత్రం ‘ఇక సెలవ్’. సాయిరవి, దీప్తి జంటగా నటించిన ఈ చిత్రానికి దర్శకుడు డుంగ్రోతు నాగరాజు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను, ఫస్ట్‌లుక్‌ను హైదరాబాద్‌లో సి.కళ్యాణ్, మారుతి విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు నాగరాజు మాట్లాడుతూ, ఎవరు ఎన్ని విధాలుగా మారిపోయినా ఎప్పటికీ మారనిది ఒక్క ప్రేమబంధమేనన్న కథనంతో ఈ చిత్రం సాగుతుందని, గ్లోబలైజేషన్ నేపథ్యంలో అన్ని బంధుత్వాలు యాంత్రికంగా మారిపోయినా ఒక్క ప్రేమబంధం ఎప్పటికీ శాశ్వతమనే కథతో ఈ చిత్రం రూపొందిందని, అందరికీ నచ్చుతుందని తెలిపారు. చిత్రానికి సంబంధించిన సెన్సార్, పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసి, విడుదలకు సిద్ధంగా వున్నామని, వచ్చేనెల రెండో వారంలో ఆడియో, నాలుగో వారంలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత గన్నవరపు చంద్రశేఖర్ తెలిపారు.
ఖమ్మం, హైదరాబాద్, వైజాగ్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహించిన ఈ చిత్రంలో అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఉంటాయని ఆయన అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వి.శ్రీనివాసరెడ్డి, సంగీతం: మధు డి, ఎడిటింగ్: నాగిరెడ్డి, నిర్మాత: గన్నవరపు చంద్రశేఖర్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: డుంగ్రోతు నాగరాజు.

రామసక్కని..
రాకుమారుడు

కెనడాలో స్థిరపడిన తెలుగు నటులు ఉదయ్, స్వప్న జంటగా కెనడా బేస్డ్ ఫిల్మ్ ప్రొడక్షన్ పతాకంపై ఉదయ్ కల్లూరి రూపొందించిన చిత్రం ‘రామసక్కని రాకుమారుడు’. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను, టీజర్‌ను విడుదల చేశారు. ఉదయ్‌కల్లూరి మాట్లాడుతూ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించామని, డిసెంబర్ 5న కెనడాలోని టోరంటోలో ఆడియో విడుదల చేయనున్నామని తెలిపారు. యువ గాయకుడు హేమచంద్ర సంగీతం అందించిన ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌కు మంచి స్పందన లభించిందని తెలిపారు. సామాజిక, సాంస్కృతిక తేడాలవలన పిల్లలు, తల్లిదండ్రులు అనుబంధాలపై ఎలాంటి ప్రభావం చూపించాయనే సందేశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని అన్నారు. కామెడీ, రొమాన్స్, ఫ్యామిలీ డ్రామా ఉన్న ఈ చిత్రాన్ని అందరికీ నచ్చే విధంగా తెరకెక్కించామని, చివరలో ఓ సందేశం కూడా ఉంటుందన్నారు. 150 నిమిషాల ఈ చిత్రంలో 3 పాటలున్నాయని, ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసి, పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నామని, సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నామని ఆయన అన్నారు. చిత్రానికి కెమెరా: జగన్నాథన్, ఎడిటింగ్: రమేష్ సెల్వరాజ్, నిర్మాత: హారిక కల్లూరి, దర్శకత్వం: ఉదయ్ కల్లూరి.