గెటప్ శ్రీను ‘ముద్దుల మొగుడు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం ఉన్న మాధ్యమాల్లో సోషల్ మీడియా అతివేగంగా విస్తరిస్తున్న విషయం తెలిసిందే. దీంతో టాలెంట్ ఉన్న నటీనటులు, దర్శకులు ఈ మాధ్యమం ద్వారా తమ ప్రతిభను చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈమధ్య కాలంలో వెబ్ సిరీస్‌పై ఎక్కువ దృష్టిపెడుతున్నారు కొంతమంది కొత్త దర్శకులు. ‘జబర్దస్త్’ కార్యక్రమం ద్వారా ఎక్కువ ప్రేక్షకాదరణ పొందిన గెటప్ శ్రీను, అప్పారావు వంటి ఆర్టిస్టులతో నాగరాజు దండు ఓ వెబ్ సిరీస్‌ని ప్రారంభిస్తున్నారు. ‘ముద్దుల మొగుడు’ పేరుతో హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా ఈ సిరీస్‌ను తీర్చిదిద్దుతున్నారు. గౌతమ్ సమర్పణలో శ్రీ మురళీకృష్ణ ఆర్ట్స్ పతాకంపై పొన్నపాటి కృష్ణవేణి ఈ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. ‘ముద్దుల మొగుడు’ టైటిల్ పాత్రను గెటప్ శ్రీను పోషిస్తున్నారు. ఇటీవల నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి ఈ వెబ్ సిరీస్‌ని ప్రారంభించారు. దీనిని యూ ట్యూబ్‌లో యోధ టీవీ చానల్ ద్వారా వీక్షించవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా వున్న యూ ట్యూబ్ ప్రేక్షకులు ఈ వెబ్ సీరిస్‌ని ఆదరించి ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నట్లు దర్శకుడు నాగరాజు దండు తెలిపారు. గెటప్ శ్రీను, జమర్దస్త్ అప్పారావు, కాటంరెడ్డి, ఫన్ బకెట్ భరత్, కౌశిక, దివ్య తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ వెబ్ సిరీస్‌కి కెమెరా: ఎస్.ఎస్.రాజు, సంగీతం: అజయ్ పట్నాయక్, సమర్పణ: గౌతమ్, నిర్మాత: పొన్నపాటి కృష్ణవేణి, దర్శకత్వం: నాగరాజు దండు.