‘సప్తగిరి’ ట్రైలర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సప్తగిరి కథానాయకుడిగా సాయి సెల్యూలాయిడ్ సినిమా టిక్ క్రియేషన్స్ పతాకంపై చరణ్ లక్కాకుల దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘సప్తగిరి ఎల్‌ఎల్‌బి’. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని 7న విడుదలకు సిద్ధమయింది. విజయ్ బుల్గానిన్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆడియోలో తొలి పాటను దర్శకుడు వి.వి.వినాయక్ విడుదల చేయగా, రెండవ పాటను సాయి ధరమ్‌తేజ్ ఆవిష్కరించారు. ఈ రెండు పాటలకు మంచి స్పందన లభిస్తోందని నిర్మాత తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ సినిమా సంబంధించిన థియేటర్ ట్రైలర్‌ను విడుదల చేసిన రామ్‌చరణ్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఆయన అన్నారు. కశిష్ ఓరా కథానాయికగా నటించిన ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్, కెమెరా: సారంగం ఎస్.ఆర్., సంగీతం: విజయ్ బుల్గానిన్, నిర్మాత: రవికిరణ్, దర్శకత్వం: చరణ్ లక్కాకుల.