బృందావనమది అందరిది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాటల రచయిత శ్రీ్ధర్ సీపాన దర్శకుడిగా మారారు. జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్, వంగల ప్రభాకరరెడ్డి రూపొందిస్తున్న చిత్రం ‘బృందావనమది అందరిది’ సినిమాకు సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ సంస్థ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ్ధర్ మాట్లాడుతూ ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగ్స్‌లో ఉన్నామని, మణిశర్మ అందించిన పాటలన్నీ బాగా వస్తున్నాయని తెలిపారు. సినిమా పేరు ఎంత అందంగా ఉందో అంతకంటే ఈ చిత్రాన్ని అందంగా రూపొందిస్తామని అన్నారు. ఈ సినిమాలో నటించే నటీనటులను డిసెంబర్ 15న మీడియాకు పరిచయం చేస్తామని, 20 నుండి కేరళలో పాటల చిత్రీకరణతో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని ఆయన అన్నారు. ఈ చిత్రానికి కెమెరా రాంప్రసాద్, సంగీతం మణిశర్మ, ఎడిటింగ్ ప్రవీణ్ పూడి, పాటలు రామజోగయ్య శాస్ర్తీ, రచన, దర్శకత్వం శ్రీ్ధర్ సీపాన.