పద్మావతికి ఇన్సూరెన్స్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పద్మావతికి పెద్ద గండమా.. ఏంటది? అని షాక్ అవుతున్నారా? పద్మావతి సినిమా మొదలుపెట్టినప్పటినుండి ఆ సినిమాపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. దీపికా పదుకొనె టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రాన్ని సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్నాడు. ఇక సినిమా విడుదల డేట్ దగ్గర పడుతుండడంతో సినిమాపై విమర్శలు ఎక్కువవుతున్నాయి. ఇప్పటికే గుజరాత్‌లో ఈ సినిమా విడుదల బ్యాన్ చేశారు. అప్పట్లో సెట్స్‌ని తగలబెట్టడం, దర్శకుడిపై దాడి చేయడం, దీపికా, బన్సాలీల తలలు నరికితే పదికోట్లు ఇస్తామంటూ పలువురు రకరకాల ప్రకటనలు చేశారు. ఈ సినిమాపై ఇంకా వివాదాలు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో సినిమా విషయంలో భారీ నష్టం సంభవించే అవకాశం ఉందన్న అనుమానంతో సినిమాకు ఇన్సూరెన్స్ చేయించారు. దాదాపు 180 కోట్లతో తెరకెక్కిన పద్మావతి సినిమాకు 140 కోట్ల ఇన్సూరెన్స్ చేశారు. దాంతో పద్మాతి సినిమాకు పెద్ద గండం తప్పినట్లే. ఈ సినిమా విషయంలో దాడులు జరిగినా, సినిమా సరిగ్గా ఆడకపోయినా, ప్రేక్షకులను థియేటర్స్‌కు రాకుండా చేయడం లాంటి ఎలాంటి సంఘటనలు జరిగినా ఇన్సూరెన్స్ డబ్బు రిటర్న్‌గా వస్తుందట. డిసెంబర్ 1న విడుదల కావాల్సిన ఈ సినిమా ఆ రోజు విడుదల అవుతుందా లేదా అన్నది చూడాలి.