గ్లామర్ డోస్ పెంచా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కృష్ణగాడి వీరప్రేమగాథ’లో హీరోయిన్‌గా తెలుగు చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మెరుపులు కురిపించింది అందాలభామ మెహ్రీన్. అందానికి తోడు టాలెంట్‌తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చక్కటి క్రేజ్‌ని సంపాదించుకుంది. ఆ తరువాత తనదైన ప్రత్యేక పాత్రలో నటిస్తూ పేరు తెచ్చుకున్న మెహ్రీన్ తాజాగా సాయిధరమ్‌తేజ్‌తో కలిసి నటిస్తున్న చిత్రం జవాన్. బివిఎస్ రవి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 1న విడుదలవుతున్న సందర్భంగా హీరోయిన్ మెహ్రీన్‌తో ఇంటర్వ్యూ..
* ‘జవాన్‌లో’ మీ పాత్ర గురించి?
- ఈ సినిమాలో భార్గవి అనే పాత్రలో కనిపిస్తా. ఇందులో పెయింటర్‌ని. చాలా అల్లరిగా.. తనమీద తనకు నమ్మకం ఉన్న అమ్మాయిగా కనిపిస్తా.. నిజంగా చెప్పాలంటే పక్కింటి అమ్మాయి పాత్ర అని చెప్పాలి.
* హీరో సాయిధరమ్‌తో వర్క్ చేయడం ఎలా ఉంది?
- సాయిధరమ్ చాలా ఫ్రెండ్లీ నేచర్ వున్న వ్యక్తి. చాలా సరదాగా ఉంటారు. కష్టపడే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. సినిమా అంటే తనకు చాలా పాషన్.
* ఇప్పటివరకు మీరు చేసిన సినిమాల్లో కథ మొత్తం మీ చుట్టూ తిరిగే పాత్రలే చేసారు కదా.. మరి ‘జవాన్’లో మీ పాత్ర ఎలా ఉంటుంది?
- ఇది ఒక జవాన్ లాంటి యువకుడి కథ. హీరో, విలన్‌లమధ్య సాగే కథ.. ఈ కథలో నేనుంటాను కానీ నా చుట్టూ తిరిగే కథ కాదు.. అలాగని పాటలకే పరిమితం కాలేదు. కాస్త గ్లామర్ డోస్ పెంచాను.
* సాయిధరమ్ మంచి డాన్సర్ కదా.. మీరు ఆయనతో పోటీ పడ్డారా?
- నేను ఇప్పటివరకు చేసిన సినిమాల్లో పెద్దగా డాన్స్‌కు స్కోప్ ఉన్న పాటలు చేయలేదు. నిజంగా సాయిధరమ్ మంచి డాన్సర్. తనతో పోటీపడి చేయాలి. అందుకే డాన్స్ బాగా ప్రాక్టీస్ చేశా. ఉదయం నాలుగున్నరకు లేచి మరీ ప్రాక్టీస్ చేసే

దాన్ని. ఇక సెట్స్‌లో తనతో పోటీ పడి చేయలేదు కానీ మేనేజ్ చేశా.
* దర్శకుడు రవి గురించి?
- దర్శకుడు రవికి ఇది రెండో సినిమా.. ఇంతకుముందు చేసిన సినిమా ఆడలేదని ఫీల్ కాలేదు. తాను చెప్పిన కథ బాగా నచ్చింది. అందులో నా పాత్ర నచ్చి ఈ సినిమాకు ఓకె చెప్పాను. తాను అద్భుతంగా తెరకెక్కించాడు. కథ విషయంలో పక్కా క్లారిటీతో ఉన్న వ్యక్తి.
* ఒక సినిమాకు ఓకె చెప్పేముందు ఏ విషయానికి మీరు ప్రాధాన్యత ఇస్తారు?
- తప్పకుండా నా పాత్ర నచ్చాలి. దాంతోపాటు కథ. ముఖ్యంగా దర్శకుడు ఎవరున్నా విషయాన్ని పట్టించుకుంటా. ఎందుకంటే దర్శకుడు టాలెంట్ వున్న వ్యక్తి అయితే.. సాధారణ కథను కూడా అద్భుతంగా తీయగలడు కదా.
* తక్కువ సమయంలో తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు.. ఎలా వుంది?
- నిజంగా ఇది అదృష్టం అని చెప్పాలి. ఎందుకంటే తెలుగు ప్రేక్షకులు నన్ను బాగా ఆదరిస్తున్నారు. మొదటి సినిమా కృష్ణగాడి వీరప్రేమగాథ సినిమాతోనే అందరూ బాగా గుర్తుపట్టారు.
* హిందీలో కూడా సినిమాలు చేస్తున్నారా
- హిందీలో ఇప్పటికే పిల్లూరి సినిమా చేసాను.. నాకు సౌత్, నార్త్ అన్న తేడాలు లేవు.. మంచి సినిమాలు వస్తే చేసుకుంటూ వెళ్లడమే.
* తదుపరి చిత్రాలు
- గోపీచంద్‌తో ఓ సినిమా చేస్తున్నాను. చక్రి దర్శకత్వంలో ఇటీవలే మొదలైన ఈ సినిమా త్వరలోనే షూటింగ్ మొదలవుతుంది.
* తెలుగు కాకుండా తమిళంలో సినిమాలు చేస్తున్నారా?
- ఇప్పటికే రెండు ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి.

- శ్రీ