వరల్డ్ రికార్డ్స్‌లో గణేష్ మాస్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢీ-2 టెలివిజన్ డాన్స్ షో విన్నర్, మా టీవీ అవార్డు గ్రహీత, భారత ఆర్ట్స్ అకాడమీ ద్వారా గబ్బర్‌సింగ్ అవార్డును గణేష్ మాస్టరు అందుకున్నారు. సినీ కొరియోగ్రాఫర్‌గా పలువురు స్టార్ హీరోలతో పనిచేశారు. ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావు ఆశీస్సులతో ఓసేయ్ రాములమ్మా చిత్రంతో కొరియోగ్రాఫర్‌గా పరిచయం అయ్యారు. తరువాత సుకుమార్, త్రివిక్రమ్, హరీశ్‌శంకర్, గుణశేఖర్, వి.వి.వినాయక్, పూరి జగన్నాధ్, కరుణాకర్, నాగేశ్వర్‌రెడ్డి వంటి దర్శకుల దగ్గర పలు చిత్రాలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. తాజాగా భారత్ వరల్డ్ రికార్డ్స్ ప్రతి ఏడాది అందించే బెస్ట్ టాలెంటెడ్ అవార్డు 2016-17కుగాను ప్రముఖ కొరియోగ్రాఫర్ గబ్బర్‌సింగ్ గణేష్ మాస్టారుకు దక్కింది. గణేష్ మాస్టర్‌కు ఈ అవార్డును మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య, భారత్ వరల్డ్ రికార్డ్స్ ఇండియా ప్రతినిధి లయన్ డా. కె.వి.రమణారావు చేతులమీదు నమోదు పత్రాన్ని అందజేశారు. ఈ అవార్డుకు తనకు రావడం చాలా ఆనందంగా ఉందని గణేష్ మాస్టర్ తెలిపారు.