కొత్త ఉత్సాహంతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోపీచంద్, రాశీఖన్నా, అను ఇమ్మాన్యుయేల్ హీరో హీరోయిన్‌లుగా ఎ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఆక్సిజన్’ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని శ్రీ సాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈనెల 30న విడుదలకు సిద్ధమయింది. ఈ సందర్భంగా దర్శకుడు జ్యోతికృష్ణ చెప్పిన విశేషాలు.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. గోపీచంద్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా ఇది. యువన్ శంకర్‌రాజా సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. తనకు ఎప్పటినుంచో తెలుగు సినిమాలకు సంగీతం అందించాలన్న కోరిక ఉండేది. పాటలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇందులో గోపీచంద్ పాత్ర కూడా కొత్తగా వుంటుంది. మంచి మెసేజ్‌తో కూడిన ఈ చిత్రాన్ని పక్కా కమర్షియల్ వేలో తెరకెక్కించాం. టెక్నికల్‌గా ఈ సినిమాలో హైస్టాండర్డ్‌లో వుంటుంది. పలువురు ప్రముఖ టెక్నీషియన్స్ పనిచేశారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్‌కు మంచి ప్రాముఖ్యత ఉంటుంది. వారితోపాటు ఇందులో 15 పాత్రలు సినిమాలో కీ రోల్ పోషించాయి. తప్పకుండా తెలుగు ప్రేక్షకులకి ఒక సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. సినిమా విడుదల విషయంలో ఆలస్యం అయిన మాట వాస్తవమే అయినా దానికి కారణం సినిమాలో 17 నిమిషాల గ్రాఫిక్స్ ఉంటుంది. గ్రాఫిక్స్ వాళ్ళు మాకు అనుకున్న టైంకు ఇవ్వలేదు. ఇక భారీతనంతో ఈ సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది. నా మొదటి సినిమా నీ మనసు నాకు తెలుసు తరువాత చాలా గ్యాప్ రావడానికి కారణం- ప్రొడక్షన్‌లో బిజీగా ఉన్నాను. దానివల్ల దర్శకత్వం కురదరలేదు. ఈ సినిమాను నాన్న చూసి బాగుంది అన్నారు.