శృతికి పెళ్లి!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమల్‌హాసన్ తనయ శృతిహాసన్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతోందా అన్న ప్రశ్నకు ఔను అన్న సమాధానం వినిపిస్తోంది అటు కోలీవుడ్ నుండి ఇటు బాలీవుడ్ దాటా. లండన్ నటుడు మైఖేల్ కోర్సెల్‌తో ఆమె ప్రేమలో వున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి అనేకసార్లు కనిపించారు కూడా. అయితే సోషల్ మీడియాలో పెళ్లి వార్తలు గురించి మాత్రం ఎటువంటి వ్యాఖ్యలు శృతి చేయడంలేదు. తాజాగా శృతిహాసన్ తన ప్రియుడిని నటి, తల్లి సారికకు పరిచయం చేశారట. వీరిద్దరూ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లుగా తెలుస్తోంది. తన వ్యక్తిగత విషయాలను ఎవరితో చెప్పుకోవడం తనకు ఇష్టముండదని, గతంలో శృతి చెప్పిన మాట ప్రకారం ఇప్పుడు కూడా పెళ్లి ప్రకటనలు కూడా ఏమీ చేయలేదు. కాబోయే అల్లుడిని తెచ్చి పరిచయం చేసింది కనుక ఈ వార్త వినిపిస్తోంది. త్వరలో పెళ్లి కబురు చెబుతుంది అని కూడా అంటున్నారు. ప్రస్తుతం ఆమె కమల్‌హాసన్ రూపొందిస్తున్న ‘శభాష్ నాయుడు’ చిత్రంలో మాత్రమే నటిస్తుండడం విశేషం.