విజయ్ దేవరకొండ షికార్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఒక్కసారిగా యూత్‌లో క్రేజీ పాపులారిటీ సంపాదించుకున్న యువ హీరో విజయ్ దేవరకొండ హవా ఇప్పుడు మామూలుగా లేదు. ‘అర్జున్ రెడ్డి’ తరువాత విజయ్ వరుసగా నాలుగు సినిమాలతో బిజీగా మారాడు. తాజాగా ఆయన రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాను గీత ఆర్ట్స్, యువి క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తుండగా ఇప్పటికే షూటింగ్ చాలా వరకు జరిగింది. తాజాగా ఈ సినిమా టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ టైటిల్ ఏమిటో తెలుసా.. ‘షికార్’! ఇందులో విజయ్ ఓ క్యాబ్ డ్రైవర్‌గా కనిపిస్తాడని.. కథ మొత్తం క్యాబ్ చుట్టే తిరుగుతుందట..! పక్కా మాస్ కమర్షియల్ హంగులతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ సరసన ప్రియాంకా జవాల్కర్ నటిస్తోంది. త్వరలోనే ఈ టైటిల్‌తో కూడిన ఫస్ట్‌లుక్‌ని విడుదల చేస్తారట. ఇక ఈ సినిమా తరువాత విజయ్.. పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా, క్రాంతిమాధవ్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు.