రాయలసీమ లవ్‌స్టోరీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకట్, హృశాలి, పావని ప్రధాన తారాగణంగా రామ్ రణధీర్ దర్శకత్వంలో నాగరాజు, హుసేన్, ఇమ్మాన్యుయేల్ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘రాయలసీమ లవ్‌స్టోరి’. చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం కర్నూలులో జరిగింది. టి.జి.వెంకటేష్ క్లాప్‌నివ్వగా, నర్వా రాజశేఖర్‌రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు. టి.జి.్భరత్ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో టి.జి.వెంకటేష్ మాట్లాడుతూ- ఇన్నాళ్లూ రాయలసీమ అంటేనే పగ, ప్రతీకారం, ఫ్యాక్షన్ అంటూ రెచ్చగొట్టే సినిమాలు వచ్చాయని, రాయలసీమ అంటే ఫ్యాక్షన్ కాదని, నిండైన మనసున్నవాళ్లు వుండే ప్రాంతమని చాటి చెప్పడానికి దర్శక నిర్మాతలు ఈ చిత్రంతో ముందుకు వచ్చారని తెలిపారు. దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో తాము ఈ చిత్రాన్ని రూపొందించడానికి ముందుకు వచ్చామని నిర్మాతలు తెలిపారు. ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రాలు కాకుండా పూర్తిగా విభిన్నమైన కోణంలో ట్రయాంగిల్ లవ్‌స్టోరీగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని దర్శకుడు రామ్ రణ్‌ధీర్ తెలిపారు. నేటి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని, కర్నూలులో పది రోజులపాటు ఈ షెడ్యూల్ జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాతలు:నాగరాజు, హుసేన్, ఇమ్మాన్యుయేల్, దర్శకత్వం:రామ్ రణ్‌ధీర్.