‘ఏక్’ పాటలు వచ్చేశాయ్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిష్ణు కథానాయకుడిగా నటించిన ‘ఏక్’ చిత్రం విజయవంతం కావాలి. ఏక్ అనే నెంబరు అందరికీ ఎంత ఇష్టమో అదే స్థానంలో ఈ చిత్రంలో నిలవాలి అని నటుడు నాగార్జున తెలిపారు. కె వరల్డ్ మూవీస్ పతాకంపై సంపత్ రుద్రారపు దర్శకత్వంలో హరికృష్ణ కొక్కొండ రూపొందించిన చిత్రం ‘ఏక్’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోవిడుదల కార్యక్రమంలో నాగార్జున పాల్గొని పాటలను, సీడీలను విడుదల చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ- ఇప్పుడు వస్తున్న కుర్రవాళ్లందరూ మంచి ప్రతిభతో వస్తున్నారని, ఈ సినిమా ట్రైలర్ చూస్తే తనకు అదే తోచిందని తెలిపారు. ఫాస్ట్ యాక్షన్ థ్రిల్లర్ విత్ లవ్‌స్టోరీతో అందరం ఇష్టపడి ఈ చిత్రాన్ని రూపొందించామని కథానాయకుడు బిష్ణు తెలిపారు. మానవీయ విలువలకు మంచి కథాంశంతో తెరకెక్కించిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని దర్శక నిర్మాతలు అన్నారు. హిమాన్షు ఖురానా, అపర్ణా శర్మ కథానాయికలుగా నటించిన ఈ చిత్రంలో సుమన్, బెనర్జి, పృధ్వీరాజ్, శ్రావణ్, సర్దార్, అమన్ ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కెమెరా: చక్రవర్తి ఘనాపాటి, సంగీతం: మంత్ర ఆనంద్, పాటలు: కాసర్ల శ్యామ్, శారద, శ్రీకుమార్, ఎడిటింగ్: నందమూరి హరి, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, నిర్మాత: హరికృష్ణ కొక్కొండ, దర్శకత్వం: సంపత్ రుద్రారపు.