‘టాక్సీవాలా’గా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అర్జున్‌రెడ్డి సినిమాతో సంచలనం రేపిన విజయ్ దేవరకొండ క్రేజ్ మామూలుగా లేదు. ఇప్పటికే నాలుగు సినిమాలతో బిజీగా మారిన విజయ్, తాజాగా కొత్త దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్ పూర్తికావస్తున్న ఈ సినిమా జనవరిలో విడుదల కానుంది. గీతా ఆర్ట్స్, యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘షికార్’ అనే టైటిల్ పెట్టాలనుకున్నారు. కానీ ఆ టైటిల్ మరో సినిమాకు ఉపయోగించడంతో తాజాగా ‘టాక్సీవాలా’ అనే పేరును ఖరారు చేసేలా ఉన్నారు. విజయ్ దేవరకొండ టాక్సీ డ్రైవర్‌గా కనిపిస్తున్న ఈ సినిమా కథ మొత్తం టాక్సీ చుట్టే తిరుగుతుందట. ప్రియాంక జవల్కర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా తరువాత విజయ్, పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా, క్రాంతిమాధవ్ దర్శకత్వంలో ఓ సినిమాతోపాటుగా మరో రెండు చిత్రాలు చేయడానికి సిద్ధమవుతున్నాడు.