కుటుంబ విలువలతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందు, శ్రీముఖి జంటగా డి.బి.వై మూవీస్ పతాకంపై వి.ఎస్.వాసు దర్శకత్వంలో దాసరి భాస్కర్ యాదవ్ రూపొందిస్తున్న సినిమా ‘కుటుంబ కథా చిత్రం’. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. నిర్మాత శివకుమార్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు వాసు మాట్లాడుతూ- థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కుటుంబం విలువలు ఎలా వుంటాయి అనే విషయాన్ని తెరకెక్కించామని, ఆసక్తికర కథాంశంతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త ఫీల్ ఇస్తుందన్నారు. ఈ సినిమాను తామే విడుదల చేస్తున్నామని, తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందని, నందుతోపాటు అందరూ బాగా నటించారని, దర్శకుడు ఎంచుకున్న కథ కొత్తగా వుండడంతో వైవిధ్యంగా తెరకెక్కించారని నిర్మాత శివకుమార్ తెలిపారు. షూటింగ్ పూర్తయిన ఈ సినిమాను త్వరలో విడుదల చేయనున్నామని నిర్మాత భాస్కర్ అన్నారు. థ్రిల్లర్ కథలను ఇప్పటివరకు మనం చాలా చూశామని, కానీ ఈ చిత్రం భిన్నంగా వుండేందుకు దర్శకుడు ప్రయత్నించాడని హీరో నందు అన్నారు. కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొని విశేషాలు తెలిపారు.