8న ‘మళ్లీరావా’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుమంత్ కథానాయకుడిగా స్వధర్మం ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై గౌతమ్ తిన్నసూరి దర్శకత్వంలో రాహుల్ నక్క రూపొందించిన చిత్రం ‘మళ్లీరావా’. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. క్లీన్ యూ సర్ట్ఫికెట్ పొందిన ఈ సినిమా డిసెంబర్ 8న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- ఇటీవల ఆడియోను వైజాగ్‌లో విడుదల చేయగా, మంచి ఆదరణ లభిస్తోందని తెలిపారు. పెళ్లిచూపులు సినిమా తరువాత సరికొత్త కథలు తెలుగులో వస్తున్నాయని, అలాగే ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను నేడు నాగచైతన్య, సమంత విడుదల చేయనున్నారని నిర్మాత రాహుల్ యాదవ్ తెలిపారు. ఆకాంక్షా సింగ్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో అన్నపూర్ణ, కాదంబరి కిరణ్, మిర్చి కిరణ్, కార్తీక్ అడుసుమల్లి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.
ఈ చిత్రానికి కెమెరా:సతీష్ ముత్యాల, సంగీతం:శ్రవణ్ భరద్వాజ్, ఎడిటింగ్:సత్య గిడుతూరి, పాటలు:కృష్ణకాంత్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:గౌతమ్ తిన్నసూరి.