8న ఆకలి పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్‌సాయి గోకులం క్రియేషన్స్ పతాకంపై గంగాధర్, రేణుక, హరీశ్ వినయ్, హారిక ప్రధాన తారాగణంగా ఆనంద్ సాగర్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ఆకలి పోరాటం’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈవారంలో విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన పోస్టర్ విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. దర్శకుడు సముద్ర పోస్టర్‌ను విడుదల చేసి భిన్నమైన కథతో వెరైటీ స్క్రీన్‌ప్లేతో తెరకెక్కిన ఈ సినిమా పేరే వైవిధ్యంగా వుందని, సరికొత్త కానె్సప్టుతో దర్శక నిర్మాతలు ఈ చిత్రాన్ని రూపొందించారని తెలిపారు. మంచి కథతోపాటు అన్ని రకాల కమర్షియల్ హంగులతో ఈ సినిమా తెరకెక్కించామని దర్శకుడు ఆనంద్ సాగర్ తెలిపారు. నిర్మాత వీరరాఘవులు సినిమా విశేషాలు తెలుపుతూ- సినిమాకు సంబంధించిన ఆడియో ఇటీవల విడుదలై మంచి ఆదరణ పొందుతోందని, ఈనెల 8న సినిమాను ప్రేక్షకులముందుకు తీసుకువస్తున్నామని, అందరికీ నచ్చుతుందన్న నమ్మకం వుందని తెలిపారు. కార్యక్రమంలో హీరో హీరోయిన్లతోపాటుగా సినిమా యూనిట్ సభ్యులు పాల్గొని విశేషాలు తెలిపారు.