నృత్య దర్శకుడు ధర్మరాజు కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనేక తెలుగు, తమిళ చిత్రాలకు నృత్య దర్శకత్వం వహించిన ధర్మరాజు (97) అనారోగ్యంతో కన్నుమూశారు. నస్రుల్లాబాద్ మండలం అంకోల్ కాంప్‌లో అనారోగ్యంతో ఆయన కన్నుమూశారు. ఆయన మరణవార్త తెలుసుకున్న ప్రభుదేవా అక్కడికి చేరుకుని తన గురువు భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. అంత్యక్రియలలో పాల్గొన్నారు. గురువులకే గురువైన బాడిగ ధర్మరాజు తన 20వ ఏటనుంచే డాన్సులపై ప్రేమతో శిక్షణ తీసుకున్నారని, చెన్నైలో స్థిరపడిన ఆయన ఎన్‌టిఆర్, కృష్ణ, మహేష్‌బాబు, జూ.ఎన్టీఆర్‌లాంటి పలువురు హీరోలకు క్లాసికల్ డాన్సర్‌గా పనిచేశారని ఆయన తెలిపారు. లవకుశ, సీతారామకళ్యాణం, ఆదిత్య 369, పౌర్ణమి వంటి దాదాపు వంద సినిమాలకు ఆయన నృత్య దర్శకత్వం వహించారు. ఆయన శిష్యులు చెన్నై, హాంగ్‌కాంగ్, హైదరాబాద్‌లలో వున్నారు. భార్య కృపావతి. వీరికి సంతానం కలుగలేదు.