త్వరలో పవన్‌తో చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోపీచంద్, రాశీఖన్నా, అను ఇమ్మాన్యుయేల్ ప్రధాన తారాగణంగా ఎ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆక్సిజన్‌‘ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎస్.ఐశ్వర్య నిర్మించారు. సినిమా గురించి రత్నం మాట్లాడుతూ- ఆక్సిజన్ చిత్రానికి వస్తున్న స్పందన బాగుంది. విడుదలైన రోజు నుండి నేటివరకు కలెక్షన్లు పెరుగుతూనే వున్నాయి. సినిమా చూసిన కొంతమంది నాకు ఫోన్ చేసి మంచి మెసేజ్ ఇచ్చారని మెచ్చుకున్నారు. ఇపుడు కూడా అలాంటి ఫోన్ కాల్స్ వస్తూనే వున్నాయి. జ్యోతికృష్ణ కథ చెప్పగానే సినిమా తీయాలనే ఆలోచన ముందు నేను అనుకోలేదు. నాకు చెప్పకముందే గోపీచంద్‌కు చెప్పాడు. గోపీచంద్‌కు నచ్చడంతో తనే నాకు ఫోన్ చేసి కథ బాగుంది, మీరు వినండి నచ్చితే చేద్దాం అని అన్నాడు. అంతకుముందు మేం చేసిన వేదాళం సినిమా సమయంలో ఆ దర్శకుడు శివ ఈ కథ విని బాగుంది, సినిమా చేయమని సలహా ఇచ్చాడు. అంతేకాకుండా ఆయనే గోపీచంద్‌కు రిఫర్ చేశారు. ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయాలని ఆలోచన వుంది. మంచి మెసేజ్ వున్న చిత్రం కనుక తమిళానికే కాదు ఏ భాషలో అయినా రీమేక్ చేయవచ్చు. నా స్నేహితుడు ఒకరు బెంగుళూరులో సినిమా చూసి హిందీలో అక్షయ్‌కుమార్, అజయ్ దేవ్‌గన్ వంటి హీరోతో ఈ సబ్జెక్టును చేయవచ్చునని అన్నారు. నా తరువాతి చిత్రం పవన్ కల్యాణ్‌తో వుంటుంది. ప్రస్తుతం ఆయన షూటింగ్‌లో బిజీగా వున్నందున సినిమా పూర్తికాగానే కలుస్తాను అని చెప్పారు.