మార్చి 4న కళ్యాణ వైభోగమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ రంజిత్ మూవీస్ పతాకంపై నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా బి.వి.నందినిరెడ్డి దర్శకత్వంలో కె.ఎల్.దామోదర్ ప్రసాద్ రూపొందించిన చిత్రం ‘కళ్యాణ వైభోగమే’. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే నెల 4న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాత కె.ఎల్.దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ, ‘అలా మొదలైంది’, ‘అంతకుముందు ఆ తర్వాత’ చిత్రాలు ఎంత విజయవంతం అయ్యాయో, అంతే స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందించామని, విజయవంతం అవుతున్నందన్న నమ్మకం సినిమా కథ, కథనం, సంగీతం, సంభాషణలు, కెమెరా పనితనం.. ఇలాంటి అంశాలు కుదిరిన విధానంపై కలిగిందని చెప్పారు. అభిషేక్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి ముందుకు వచ్చినందుకు వారికి కృతజ్ఞతలని అన్నారు. ప్రస్తుతం యువత ప్రేమ పెళ్లి లాంటి బంధాలపై వున్న అభిప్రాయాలను ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా కామెడీ, సంగీతం మేళవించి భావోద్వేగాలతో రూపొందించామని, మనిషి విలువను చాటి చెప్పేలా రూపొందిన కుటుంబ కథా చిత్రం ఇదని దర్శకురాలు బి.వి.నందినిరెడ్డి అన్నారు. ఈ సినిమాకు సంబంధించిన పాటలు ఇప్పటికే విడుదలై ప్రజాదరణ పొందాయని, ఇది తమకు చిత్ర విజయంపై నమ్మకం కలిగిస్తోందని, అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి మార్చి 4న ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని ఆమె తెలిపారు. రాశి, ఐశ్వర్య, ఆనంద్, రాజ్ మదిరాజ్, తా.రమేష్, ధన్‌రాజ్, హేమంత్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:కళ్యాణ్ కోడూరి, కెమెరా: జి.వి.ఎస్.రాజు, మాటలు, పాటలు: లక్ష్మీభూపాల్, నిర్మాత: కె.ఎల్. దామోదర్ ప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బి.వి.నందినిరెడ్డి.