నితిన్ సరసన..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక లైలాకోసం అంటూ తెలుగు తెరపైకివచ్చిన పూజా హెగ్డే కోలీవుడ్, బాలీవుడ్‌లోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ ఎక్కడా సరైన హిట్స్ అందకపోవడంతో ‘దువ్వాడ జగన్నాథం’తో ఎంట్రీ ఇచ్చింది. సినిమా రిజల్ట్ ఎలా వున్నా బికినీలో సందడి చేసిన ఈ అమ్మడికి ఆఫర్లు బాగానే వస్తున్నాయి. తన అందంతోనే అవకాశాలను దక్కించుకుంటోంది. ప్రస్తుతం తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్‌తో ‘సాక్ష్యం’ చిత్రంలో నటిస్తోంది. తాజాగా దిల్‌రాజు ప్రొడక్షన్ నుండి మరో ఆఫర్ దక్కింది. నితిన్‌తో తాజాగా ఆయన నిర్మించబోయే శ్రీనివాస కల్యాణం సినిమాకు పూజాహెగ్డేని ఎంపిక చేశారట. ‘శతమానంభవతి’తో హిట్ అందుకున్న సతీష్ వేగేశ్న ఈ సినిమాకు దర్శకుడు. ప్రస్తుతం నిర్మాత ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుతున్నారు. అన్ని పనులను పూర్తిచేసి త్వరగా సినిమాను సెట్స్‌పైకి తీసుకురావడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సినిమాతోనైనా పూజా హెగ్డే టాప్ హీరోయిన్‌గా ఎదుగుతుందేమో చూడాలి. ఓకె..!