‘ఇంద్రసేన’ విజయోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైవిధ్య కథలను ఎంచుకొంటూ తెలుగులో తనకంటూ ఓ గుర్తింపు సాధించాడు విజయ్ ఆంటోని. తాజాగా ఆయన ‘ఇంద్రసేన’గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శ్రీనివాసన్ దర్శకత్వంలో ఎన్.కె.ఆర్. ఫిలిమ్స్ పతాకంపై నీలం కృష్ణారెడ్డి అందించిన ఈ చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. సినిమాకు సంబంధించిన విజయోత్సవ వేడుక ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా రచయిత భాష్యశ్రీ మాట్లాడుతూ ఇంత మంచి విజయాన్ని అందుకున్నందుకు ఆనందంగా ఉందని, రెండు పాటలు బాగున్నాయని అందరూ చెబుతున్నారని అన్నారు. భిన్నమైన కథతో తెలుగు ప్రేక్షకుల మనసులను విజయ్ ఆంటోని ఆకట్టుకున్నారని ఆయన అన్నారు. తనను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలని, ఈ సినిమాలో తాను రెండు పాత్రల్లో నటించానని, అన్నదమ్ముల మధ్య ఉన్న అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయని హీరో విజయ్ ఆంటోని తెలిపారు. మంచి పాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనందుకు సంతోషంగా ఉందని కథానాయిక డైనా చంపిక అన్నారు. ఇంద్రసేన కుటుంబమంతా కలిసి చూడదగిన చిత్రమని, అన్నదమ్ముల అనుబంధ నేపథ్యంలో వైవిధ్యంగా తెరకెక్కిన ఈ చిత్రం మరింత విజయాన్ని అందుకోనున్నదని నిర్మాత నీలం కృష్ణారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో సినిమా యూనిట్ పాల్గొని విశేషాలు తెలిపారు.