కృష్ణకు ఆట జీవన సాఫల్య పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికాలో తెలుగు సంస్థగా పేరుగన్న ‘ఆట’ (అమెరికన్ తెలుగు అసోసియేషన్) ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న జీవన సాఫల్య పురస్కారాన్ని ఈసారి నటశేఖర కృష్ణకు అందించనున్నారు. నవంబర్ 26 నుండి డిసెంబర్ 23 వరకు జరుగనున్న ఆట కార్యక్రమాల్లో కృష్ణకు ఈ పురస్కారాన్ని అందజేయనున్నామని అధ్యక్షులు కరుణాకర్ అశిరెడ్డి తెలిపారు. మన మూలాలు, మన భాష, సంస్కృతి, సంప్రదాయాలు మర్చిపోకూడదనే ఉద్దేశ్యంతో రెండున్నర దశాబ్దాల నుండి ఈ విధమైన కార్యక్రమాలను చేస్తున్నామని, ముగింపు వేడుకలకు పలువురు ప్రముఖులు హాజరు కానున్నారని, 23న సూపర్‌స్టార్ కృష్ణకు పురస్కారాన్ని అందజేయనున్నామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ, లోహిత్, మధుసూదన్ కోడూరు, అనిల్ బొద్దిరెడ్డి, భువనేష్ భూజాల, సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొని విశేషాలను తెలిపారు.