మాతంగి ట్రైలర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హారర్, కామెడీ ఎమోషన్ ఎంటర్‌టైనర్‌గా ‘మాతంగి’ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుంది. ఈ చిత్రంలో నేను రెండు షేడ్స్ లో నటించా. ముఖ్యంగా అమ్మోరు షేడ్స్ లో వున్న పాత్ర ప్రేక్షకులకు గిలిగింతలు పెడుతుం ది. గతంలో నేను నటించిన అమ్మోరు చిత్రానికి మించి ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నా. ఈనెల 15న ఈ సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు అని నటి రమ్యకృష్ణ తెలిపారు. రమ్యకృష్ణ, జయరామ్, సంపత్ ప్రధాన తారాగణంగా శ్రీనివాసా విజువల్స్ ప్రై. లి. పతాకంపై కన్నన్ తామరక్కు ళ్ళం దర్శకత్వంలో మలయాళంలో రూపొందించిన చిత్రాన్ని తెలుగులో ఎస్.వేణుగోపాల్ సజ్జు అందిస్తున్నారు. మలయాళంలో రమ్యకృష్ణ సోదరి వినయ కృష్ణన్ రూపొందించారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ లాబ్‌లో జరిగింది. కార్యక్రమానికి విచ్చేసిన దర్శకురాలు నందినిరెడ్డి మాట్లాడుతూ- వినయకృష్ణన్‌కు ఎలాంటి కథలు చెప్పినా నచ్చవని, ఒక పట్టాన ఆమెను ఒప్పించలేరని, అలాంటిది ఈ సినిమా కథ నచ్చి ఆమె రూపొందించారు అంటే సమ్‌థింగ్ స్పెషల్ ఉంటుందని నేను నమ్ముతున్నానని తెలిపారు. మాతంగి సినిమా ట్రైలర్ చూస్తుంటే అమ్మోరు సినిమా షేడ్స్ కనిపించాయని, ఈ సినిమా విజయవంతం కావాలని ఆమె కోరుకున్నారు. కార్యక్రమంలో రమ్యకృష్ణ తనయుడు రుత్విక్ పాల్గొని విశేషాలు తెలిపారు. కళాభవన్ మణి, వీణానాయర్, బేబి అక్షర, కిశోర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:రతీష్ వేగా, నిర్మాత:వినయకృష్ణన్, దర్శకత్వం:కన్నన్ తామరక్కుళం.