గ్లామర్ అంటే ఎక్స్‌పోజింగ్ కాదు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కమెడియన్ నుండి హీరోగా మారిన సునీల్, అందాల భామలు నిక్కీగల్రాని, డింపుల్ చొపాడే ప్రధాన పాత్రల్లో వాసువర్మ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మిస్తున్న చిత్రం ‘కృష్ణాష్టమి’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని ఈనెల 19న ఈ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా హీరోయిన్ నిక్కీగల్రాని చెప్పిన విశేషాలు.
మీ నేపథ్యం..
నిజానికి నేను హీరోయిన్ కావడం ఇంట్లోవారికీ అస్సలు ఇష్టం లేదు. కాని నా తపన చూసి కాదనలేదు. ఇంట్లోవారికి నేను డాక్టర్ అవ్వాలని కల. అలాగే సైన్స్‌లో జాయిన్ అయ్యి మధ్యలోనే వదిలేసి, ఫ్యాషన్ డిజైనింగ్ పూర్తిచేశాను. కాలేజీ టైంలోనే సినిమాల్లో నటించమని చాలా ఆఫర్స్ వచ్చాయి. కాని ఎందుకో ఒప్పుకోలేదు. కోర్సు కంప్లీట్ చేసి మోడలింగ్ చేయడం మొదలుపెట్టాను. 10 నెలల్లో 45 యాడ్స్‌లో నటించాను. 1983 అనే మలయాళం సినిమా ద్వారా సినిమాల్లోకి అడుగుపెట్టాను. కృష్ణాష్టమి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతున్నందుకు ఆనందంగా ఉంది.
ఈ సినిమాలో అవకాశం ఎలా వచ్చింది?
కేరళలో ఓ సినిమా షూటింగ్ చేస్తోన్న సమయంలో దిల్‌రాజుగారి ఆఫీస్ నుండి ఫోన్ వచ్చింది. వాళ్ళు చెప్పిన డేట్స్‌కి నేను వేరే మలయాళం సినిమా కమిట్ అయ్యాను. అక్కడ ఒక సినిమా చేస్తున్నప్పుడు మరో సినిమా చేయకూడదు. అందుకే ఈ సినిమా వదిలేయాలి అనుకున్నాను. కాని రెండు మూడురోజుల తరువాత దిల్‌రాజుగారు ఫోన్ చేసి సినిమా మొదలుకావడానికి నెల టైం ఉంది పరవాలేదని చెప్పారు. అలా ఈ చాన్స్ వచ్చింది.
మీ పాత్ర గురించి?
ఎన్నారై అమ్మాయి పాత్రలో కనిపిస్తాను. నా క్యారెక్టర్ పేరు పల్లవి. బేసిక్‌గా తను మంచి రైటర్. ‘పల్లవిజం’ అనే ఓ బుక్ రాస్తుంటుంది. క్యూట్‌గా ఇన్నోసెంట్‌గా ఉండే తను ‘పల్లవిజం’లో రాసే లాజిక్స్‌కు ఇంటెన్స్ మీనింగ్ ఉంటుంది. ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుందని ఆలోచించే వ్యక్తి. ఏ సమస్యనైనా పాజిటివ్‌గా తీసుకొని సాల్వ్ చేసుకుంటుంది.
సునీల్‌తో పని చేయడం ఎలా ఉంది?
సునీల్‌గారితో వర్క్‌చేయడం చాలా బాగా అనిపించింది. స్వీట్ అండ్ హంబుల్ పెర్సన్. ఆయన దగ్గరనుండి చాలా నేర్చుకున్నాను. వర్క్ పట్ల డెడికేషన్ ఉన్న మనిషి. సినిమాలో హీరో పేరు కృష్ణవరప్రసాద్. తను పుట్టింది కృష్ణాష్టమి రోజు. కృష్ణాష్టమి రోజునే తన లైఫ్‌లో పెద్ద ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆ ఘటనతో తన జీవితంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. అవి ఏమిటి అనేది సినిమాలో చూడాలి.
తెలుగు పరిశ్రమ ఎలా ఉంది?
నేను మలయాళం, తమిళం, కన్నడ సినిమాల్లో నటించాను. భాషనుబట్టి సినిమాను క్యాటరైజ్ చేయలేను. ఏదైనా సినిమానే. ప్రొఫెషన్ ఒక్కటే. కాని మలయాళం సినిమాలు జీవితానికి దగ్గరగాఉంటాయి. తమిళంలో రియాల్టీకి దగ్గరగా ఉంటూ కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్‌చేస్తారు. తెలుగు సినిమాల్లోమాత్రం కమర్షియాలిటీ ఎక్కువ ఉంటుంది. నిజంగా ఇక్కడ పనిచేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను.
గ్లామర్ పాత్రల్లో నటించేందుకు సిద్ధమేనా?
నేను నటించే సినిమాలు కుటుంబమంతా కలిసి చూడాలి. అలా ఉండే పాత్రలే ఎన్నుకుంటాను. నా దృష్టిలో గ్లామర్ అంటే స్కిన్‌షో కాదు. అమ్మాయిని చీరలో కూడా గ్లామర్‌గా చూపించొచ్చు. ఈ సినిమాలో నేను స్కర్ట్స్, జీన్స్ వేసుకున్నాను. క్యూట్‌గా కనిపిస్తాను కాని ఎక్కడా వల్గారిటీ ఉండదు. టిపికల్ హీరోయిన్‌గా ఉండడం నచ్చదు. పాటలకు, కొన్ని సీన్లకు మాత్రమే హీరోయిన్‌గా నటించడం నాకు నచ్చదు. నా పాత్రకు వెయిట్ ఉండాలి. పెర్ఫార్మన్స్‌కు స్కోప్ ఉండాలి. అందుకే నా పాత్రలో ఎంపికలో చాలాజాగ్రత్తలు తీసుకుంటాను.
మీ సిస్టర్ సంజన గురించి?
సినిమా కథలు నేనే వింటాను. నాకు నచ్చిన తరువాత ఫ్యామిలీతో డిస్కస్ చేస్తాను. నాకు ఏవైనా డౌట్స్ ఉంటే అక్కను (సంజన) అడిగి క్లారిఫై చేసుకుంటాను. నాకు అక్క అంటే అమ్మలాగా. తనతో మంచి బాండింగ్ ఉంటుంది.
నెక్స్ట్ ప్రాజెక్ట్స్...
తమిళంలో మూడు సినిమాల్లో నటిస్తున్నాను. తెలుగులో కూడా ఆఫర్స్ వస్తున్నాయి. ‘కృష్ణాష్టమి’ రిలీజ్ అయిన తరువాత ఫైనల్ చేస్తాను.

- శ్రీ