మానవ సంబంధాల నేపథ్యంలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘2 కంట్రీస్’ చిత్రంలో మానవ సంబంధాల నేపథ్యంలో కథనం ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. అనేక చిత్రాలు తీసిన తరువాత నా రీఎంట్రీలో ఎలాంటి చిత్రం రూపొందించాలా? అని అనుకున్నా. మలయాళంలో విజయవంతమైన ఈ చిత్రాన్ని నిర్మించాలనుకుంటే, వేరేవాళ్ళు ఆ హక్కులు తీసుకుంటున్నారని తెలిసింది. కానీ అనుకోకుండా ఆ సినిమా రైట్స్ నాకే రావడం విచిత్రం అని దర్శకుడు ఎన్.శంకర్ తెలిపారు. మహాలక్ష్మి ఆర్ట్స్ పతాకంపై సునీల్, మనీషారాజ్ జంటగా స్వీయ దర్శకత్వంలో ఎన్.శంకర్ రూపొందించిన చిత్రం ‘2 కంట్రీస్’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. సీడీని నాని విడుదల చేసి తొలి కాపీని సునీల్‌కు అందించారు. ఈ సందర్భంగా దర్శకుడు శంకర్ చిత్ర విశేషాలను వివరిస్తూ- సునీల్ ఓ ట్రాన్స్‌ఫారమ్ లాంటివాడని, ఒకే సన్నివేశాన్ని ఎన్ని టేకుల్లో చేసినా వైవిధ్యం ప్రదర్శించగలడని, ఏ టేక్‌లో బాగా చేశాడు అనేదాన్ని మనం జడ్జ్ చేయలేమని ఆయన అన్నారు. గోపీసుందర్ పాటలతోపాటుగా రీరికార్డింగ్‌ను అద్భుతంగా చేశారని, చూసే ప్రేక్షకులు తప్పక ఎంజాయ్ చేస్తారని తెలిపారు. కథానాయకుడు ద్వేషాన్ని ద్వేషంతో ప్రేమించలేడని, ప్రేమను ప్రేమతో జయిస్తాను అని చెప్పడమే ఈ సినిమాలో ప్రధానాంశమని ఆయన అన్నారు. కథానాయికా నటించిన మనీషారాజ్ తొలుత గాయనిగా పరిచయం చేయమని తన వద్దకు వచ్చిందని, కానీ ఆమె ఆ పాత్రలో నటించగలదన్న నమ్మకంతో హీరోయిన్‌గా అవకాశం ఇచ్చామని ఆయన అన్నారు. శంకర్ ఈ సినిమాను చేయాలనుకోవడం తన కెరీర్‌కు ప్లస్ లాంటిదని గోపీసుందర్ ఇచ్చిన పాటలు ప్రతి ఒక్కరికీ నచ్చుతాయని, పవన్‌కళ్యాణ్ టీజర్ విడుదల చేస్తే ఇపుడు నాని ఆడియోను విడుదల చేయడం ఆనందాన్నిచ్చిందని సునీల్ తెలిపారు. సునీల్ అంటే తనకెంతో ఇష్టమని, నాకు తొలి రోజులలో పూర్తి కాన్ఫిడెన్స్ ఇచ్చిన వ్యక్తిఅని, ఆయన కామెడీతో ఈ సినిమా హిట్ అవ్వాలని నాని కోరుకున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 29న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని ఆయన అన్నారు. కార్యక్రమంలో మహాలక్ష్మి, రాంప్రసాద్, ప్రేమ్‌రాజ్, డి.ఎస్.రావు, కాశీవిశ్వనాధ్, దొరై రాజు, అశోక్, శ్రీ్ధర్ రెడ్డి, వీరశంకర్, పి.సునీల్‌కుమార్, దశరధ్, రవి, మోహన్, శ్రీనివాస్, వెంకి కుడుముల, ఇ.సత్తిబాబు, వి.ఎన్.ఆదిత్య, పృధ్వీ, రచ్చరవి, నందిని సిధారెడ్డి, శ్రీనివాసరెడ్డి, భాస్కరభట్ల, దేదీప్య, వైష్ణవి పాల్గొన్నారు.