29న 2 కంట్రీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్.శంకర్ స్వీయ దర్శకత్వంలో సునీల్, మనీషారాజ్ జంటగా మహాలక్ష్మి ఆర్ట్స్ పతాకంపై రూపొందించిన చిత్రం ‘2 కంట్రీస్’. సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని క్లీన్ యు సర్ట్ఫికెట్ అందుకున్న ఈ సినిమా ఈనెల 29న విడుదలకు సిద్ధమవుతోంది. మలయాళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు రీమేక్ టైటిల్‌కు, పోస్టర్‌కు, టీజర్, ట్రైలర్లకు విశేష స్పందన లభించిందని ఎన్.శంకర్ తెలియజేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ- ‘వైవిధ్యమైన కథ, కథనాలతో రూపొందించిన ఈ సినిమా షూటింగ్ అమెరికాలో గ్రాండ్ విజువల్ ఫీస్ట్‌గా తెరకెక్కించామని, సునీల్ కామెడీ, టైమింగ్, స్టోరీ నేరేషన్ సినిమాకు హైలెట్‌గా వుంటాయని తెలిపారు. 30 ఇయర్స్ పృధ్వీ, శ్రీనివాసరెడ్డి కాంబినేషన్‌లో వచ్చే సీన్స్ కడుపుబ్బ నవ్విస్తాయని, గోపీసుందర్ ఆర్.ఆర్ ప్రతి సన్నివేశాన్ని హైలెట్ చేసేలా వుంటుందని, ఈ సినిమా ప్రతి ప్రేక్షకుడికి నచ్చేలా రూపొందిందని తెలిపారు. నరేష్, షాయాజీ షిండే, దేవ్‌గిల్, కృష్ణ్భగవాన్, చంద్రమోహన్, రాజ్యలక్ష్మి, సితార, రాజా రవీంద్ర, సంజన, శివారెడ్డి, ప్రవీణ, హర్షిత, చమ్మక్ చంద్ర, రచ్చ రవి, శేషు, ఝాన్సీ తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు: శ్రీ్ధర్ శీపాన, కెమెరా: సి.రాంప్రసాద్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకత్వం: ఎన్.శంకర్.