నానితో నాగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో తెరకెక్కనున్న మరో మల్టీస్టారర్ సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయన్న విషయం తెలిసిందే. అక్కినేని నాగార్జున, నానిలతో తెరకెక్కే ఈ మల్టీస్టారర్ గురించి ఇదివరకే ప్రకటన వచ్చింది. ‘్భలే మంచిరోజు’ సినిమా ఫేం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించే ఈ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తికావచ్చాయి. నాగార్జున తన కుమారుడు అఖిల్ నటిస్తున్న ‘హలో’ విడుదల విషయంలో బిజీగా వున్నాడు. ఈ నెల 22న రానున్న ఈ సినిమా తరువాత నాగార్జున ఫ్రీ అవుతాడు. అందుకే ఈ సినిమాకు సంబంధించిన ప్రయత్నాలు శరవేగంగా జరుగుతున్నాయి. జనవరిలో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి దసరాకు విడుదల చేయనున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.