రెగ్యులర్ షూటింగ్‌లో గోపీచంద్ చిత్రం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 20 December 2017
‘ఆక్సిజన్’ చిత్రం తరువాత గోపీచంద్ నటిస్తున్న 25వ చిత్రం ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. నూతన దర్శకుడు చక్రి ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. గోపీసుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై రాధామోహన్ నిర్మిస్తున్నారు. మంచి కథ, కథనంతో తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈరోజు హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సినిమాలో మెహరీన్ టీచర్‌గా నటిస్తోంది. డిఫరెంట్ స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాతో గోపీచంద్ తప్పకుండా విజయం సాధిస్తాడని చిత్ర దర్శకుడు చక్రి నమ్మకంతో చెబుతున్నారు. ఈ సినిమాతోపాటు గోపీచంద్ మరికొన్ని చిత్రాలు కూడా చేయబోతున్నాడు. ఆ ప్రాజెక్టులన్నీ చర్చల దశలో ఉన్నాయి.