శివరాత్రికి సతీ తిమ్మమాంబ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భవ్యశ్రీ ప్రధాన పాత్రలో ఎస్.ఎస్.ఎస్. ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై బాలగొండ ఆంజనేయులు దర్శకత్వంలో పెద్దరాసు సుబ్రహ్మణ్యం రూపొందించిన చారిత్రాత్మక చిత్రం ‘సతీ తిమ్మమాంబ’. భారీ గ్రాఫిక్స్‌తో ముస్తాబైన ఈ చిత్రాన్ని మహాశివరాత్రి కానుకగా విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు ఆంజనేయులు మాట్లాడుతూ, అనంతపురం జిల్లా కదిరి ప్రాంతంలో ఏడెకరాల భూమిలో విశిష్టత కలిగిన తిమ్మమ్మ మర్రిమాను చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని తెలిపారు. సుమారు 600 సంవత్సరాల చరిత్ర వున్న తిమ్మమ్మ మర్రిమాను గురించి చిత్రాన్ని రూపొందించడం అందరి మన్ననలు పొందిందని, గిన్నీస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో ఈ మర్రిమానుకు చోటు లభించిందని నిర్మాత సుబ్రహ్మణ్యం అన్నారు. ఈ మాను చరిత్రను ప్రజలకు తెలియజేయాలనే సంకల్పంతో మహాశివరాత్రికి మానుదగ్గర జరిగే జాతరను ‘్థరు’గా వ్యవహరిస్తారని ఆయన అన్నారు. మూడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవంలో తిమ్మమ్మ అత్తింటివారు పాల్గొంటారని, అందుకే ఈ చిత్రాన్ని మహాశివరాత్రి కనుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన అన్నారు. ప్రభాకర్, రంగనాథ్, చంద్రమోహన్, రాజశ్రీ, జూ.రేలంగి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: బండారు దానయ్యకవి, కెమెరా: షాహిద్ హుస్సేన్, ఎడిటింగ్: వినయ్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బాలగొండ ఆంజనేయులు.