టీజర్‌లో ఎవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తారకరత్న, శేఖర్, యామిని, చందూ ప్రధాన పాత్రల్లో వెంకటరమణ సల్వా దర్శకత్వంలో ముప్ప క్రాంతి చిత్ర పతాకంపై ముప్ప అంకమ్మ చౌదరి నిర్మిస్తున్న ‘ఎవరు’ చిత్రం టీజర్ ఆవిష్కరణ గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో తారకరత్న మాట్లాడుతూ ఇప్పటివరకు ఇలాంటి కథ రాలేదని, ఈ సినిమాలో హీరోహీరోయిన్ అని కాకుండా, ఉన్న పాత్రలన్నీ లీడ్ రోల్ పోషించాయని అన్నారు. ఈ సినిమా మా అందరికీ మైల్‌స్టోన్‌గా నిలిచిపోతుందన్నారు. ‘సిందూర పువ్వు’ కృష్ణారెడ్డి మాట్లాడుతూ, టీజర్ చాలా ఆసక్తికరంగా ఉందని, హారర్, సస్పెన్స్ అంశాలతో తెర కెక్కించిన ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందన్నారు. దర్శకుడు వెంకటరమణ మాట్లాడుతూ, మిస్టరీ డ్రామా ఉన్న సినిమా ఇదని, హారర్ అంశాలు జోడించి తెర కెక్కించామని, తారకరత్న పాత్ర కొత్తగా ఉంటుందని, తనొక జర్నలిస్టుగా కనిపించబోతున్నాడని అన్నారు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే సినిమా ఇది అన్నారు. ఈ కార్యక్రమంలో రఘు, ప్రసన్నకుమార్ పాల్గొన్నారు.