ఒక్క క్షణమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్ష్మీనరసింహ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అల్లు శిరీష్, సురభి, సీరత్‌కపూర్, అవసరాల శ్రీనివాస్ ప్రధాన తారాగణంగా వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో చక్రి చిగురుపాటి రూపొందించిన చిత్రం ‘ఒక్క క్షణం’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 28న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రీ రిలీజ్ కార్యక్రమంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ- ఈ సినిమా ప్రారంభం కావడం వెనుక తాను కూడా ఓ చిన్న భూమిక పోషించానని, ఆనంద్ మంచి బ్రిలియెంట్ దర్శకుడు అని తెలిపారు. భవిష్యత్తులో ఆయననుండి మంచి చిత్రాలను ఆశించవచ్చని, తాను నటిస్తున్న సూర్య సినిమా పేరే గర్వపడేలా వుంటుందని భావిస్తున్నానని తెలిపారు. జనవరి 1న ఫస్ట్ టీజర్ విడుదల కానుందని ఆయన అన్నారు. నిర్మాత సినిమాపై నమ్మకంతో ఎక్కడా రాజీపడలేదని, శిరీష్ 14 నెలలుగా ఈ సినిమా కోసమే పనిచేశారని దర్శకుడు వి.ఐ.ఆనంద్ అన్నారు. ప్యార్‌లల్ లైఫ్ ఆఫ్ కానె్సప్ట్‌తో చేసిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ మీరు చూశారని, ఇక సినిమానే మాట్లాడుతుందని హీరో శిరీష్ అన్నారు. కథ వినగానే చాలా ఉద్వేగంతో ఈ సినిమా చేయాలనుకున్నానని, ఖచ్చితంగా ప్రేక్షకులకు కొత్త రకం సినిమాగా పరిచయం అవుతుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో సినిమా యూనిట్ పాల్గొని విశేషాలు తెలిపారు.