సవ్యసాచిలో భూమిక?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పట్లో హీరోయిన్‌గా ఓ రేంజ్ ఇమేజ్ తెచ్చుకున్న అందాల భామ భూమిక పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయింది. కొంత గ్యాప్ తరుత రీ ఎంట్రీ ఇస్తూ నానితో కలిసి ‘ఎంసిఏ’ సినిమాలో నటించింది. ఇటీవలే విడుదలైన ఈ సినిమాలవో భూమిక పాత్ర అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా తరువాత ఈ అమ్మడికి వరుస అవకాశాలు క్యూకట్టాయి. ఇప్పటికే పలు అవకాశాలు వస్తున్నాయట. తాజాగా నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో ‘సవ్యసాచి’ చిత్రంలో ఓ కీలక పాత్ర చేసే అవకాశం కొట్టేసింది. నిజానికి ఈ పాత్రలో ఎవరు నటిస్తారా అని అనే్వషణలో పడ్డ దర్శకుడికి భూమిక అయితే బెటర్ అని ఆమెను సంప్రదించాడని టాక్. మైత్రి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. మొత్తానికి సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భూమిక మళ్లీ తన హవా చాటుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు మరి!